ఒకవైపు తెలుగు రాష్ట్రాల్లో విరామం లేకుండా వర్షాలు కురుస్తుంటే, మరోవైపు పవన్ కల్యాణ్ పవర్ తూఫాన్ కొత్త రికార్డులు సృష్టిస్తోంది. పుట్టిన రోజు సందర్బంగా పవన్ కళ్యాణ్ బ్లాక్‌బస్టర్ సినిమా గబ్బర్ సింగ్ రీ-రిలీజ్ అవగా, అభిమానులు వర్షానికి లెక్క చేయకుండ థియేటర్ల వద్దకు చేరుకుంటున్నారు. ఈ సినిమా తో 2012లో భారీ హిట్ తో కమ్‌బ్యాక్ ఇచ్చిన పవన్ కళ్యాణ్, మరోసారి తన బాక్సాఫీస్ పవర్ ఎంతో చూపించాడు. తెలుగు రాష్ట్రాల్లో 1600కి పైగా షోస్ వేయగా, ఈ సినిమా ఇండియా వ్యాప్తంగా తొలి రోజు 8 కోట్ల రూపాయలు కలెక్ట్ చేసి, మొదటి రోజు అత్యధిక వసూళ్లను సాధించిన చిత్రంగా నిలిచింది. తమిళ సూపర్‌స్టార్ విజయ్ నటించిన గిల్లి రీ-రిలీజ్‌లో నంబర్ 1 స్థానం లో ఉండగా, ఆ సినిమా కంటే ఎక్కువ కలెక్షన్స్ సాధించి నంబర్ 1 స్థానాన్ని కైవసం చేసుకుంది.
ఈ సినిమా ఏరియా వారీగా వసూళ్లలోకి వస్తే (Updated) :
సీడెడ్: ₹82.17 లక్షలు
నిజాం: ₹3.1 కోట్లు (including premiers)
ఆంధ్ర: ₹2.6 కోట్లు (including premiers)
కర్ణాటక: ₹53 లక్షలు (including premiers)
తమిళనాడు & రెస్ట్ ఆఫ్ ఇండియా: ₹37+ లక్షలు (including premiers)
ఓవర్సీస్: 75 లక్షలు (estimated)
ఇండియా వ్యాప్తంగా ₹7.8 కోట్లకు పైగా వసూళ్లను సాధించింది. ప్రీమియర్స్‌తో కలిపి ₹8.2 కోట్లకు పైగా వసూళ్లను సాధించింది.
NOTE: Data gathered from various sources